మోగిన ఎన్నికల నగారా

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను  ప్రకటించింది. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ  స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.

ఏప్రిల్‌ 11న తొలి దశ

రెండో దశ ఏప్రిల్‌ 18

మూడో దశ ఏప్రిల్‌ 23

నాలుగో దశ ఏప్రిల్‌ 29

ఐదో దశ మే6న

ఆరో దశ మే 12

ఏడో దశ మే19

షెడ్యూల్‌ ప్రకటనతో తక్షణమే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో 175, ఒడిశాలో 147, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 60, సిక్కింలో 32 శాసనసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 23న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్లు అరోడా పేర్కొన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి 12 రకాల గుర్తింపు కార్డులను అనుమతిస్తామని అరోడా వివరించారు. ‘‘పోలింగ్‌కు ఐదు రోజుల ముందుగానే ఓటర్లకు పోల్‌ చిట్టీలను పంపిణీ చేస్తాం. దేశవ్యాప్తంగా 10 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అదనంగా లక్ష పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్‌ నిర్వహిస్తాం’’ అని అరోడా వివరించారు.

error: