పవన్‌కల్యాణ్ ఏలూరులో ఓటు హక్కు పొందడంతో అభిమానులు, ఆ పార్టీ నాయకుల్లో ఈ చర్చ మొదలైంది. గతంలో ఏలూరు పోస్టల్ కాలనీలో ఓ ఇల్లును పవన్ పేరిట నాయకులు అద్దెకు తీసుకున్నారు. అదే ఇంటి చిరునామాతో ఓటుహక్కు పొందారు.
బహిరంగ సభ ప్రసంగంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…
మా తాత పెనుగొండలో పోస్టుమేన్‌గా పనిచేశారు. మా నాన్న మొగల్తూరులో కానిస్టేబుల్‌గా పనిచేశారు. మా నాన్న మాకున్న రెండెకరాల భూమిని ఆడపిల్లల పెళ్లిళ్లకోసం అమ్మేశారు. ఆ భూమి ఉంటే ఇక్కడే ఉండిపోయేవాడిని. మా పూర్వీకులు ఇక్కడే నివసించినా.. నేనున్నది తక్కువ. చిన్నప్పుడు రెండు సార్లు వచ్చా. నరసాపురంలో తప్పిపోయా. అప్పట్లో కానిస్టేబుల్ రక్షించి మా నాన్నకు అప్పగించారు. మొగల్తూరులో చెట్టెక్కి జామకాయలు కోసిన తీపి జ్ఞాపకం గుర్తుందీ. ఈ పచ్చని జిల్లాను చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తోంది. మా పూర్వీకుల మూలాలున్న ప్రాంతంగా ఈ జిల్లా అంటే ఎంతో అభిమానం. జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటా’ అని పశ్చిమగోదావరి జిల్లా గురించి తన అభిమానాన్ని చాటుకున్నారు.