ఫిజియో థెరఫీ, మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఖైరతాబాద్ పరిధిలోని ఎసీ గార్డ్స్‌లో అట్లాంటిక్ హాస్పిటాలిటీ ఫిజియోథెరఫీ క్లినిక్ పేరుతో మసాజ్ సెంటర్ కొనసాగుతోంది. అయితే కొద్దిరోజులుగా అందులో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో గురువారం రాత్రి డీఐ రాజునాయక్ సిబ్బందితో ఆ క్లినిక్‌లో ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా విటులు, యువతులతో పాటు నిర్వాహకురాలు మెహరాజున్నీసా(45)ను అదుపులోకి తీసుకున్నారు. మెహరాజున్నీసా గతంలో మెహిదీపట్నంలోని ఓ మసాజ్ సెంటర్లో రిసెప్షనిస్ట్‌గా పనిచేసింది. యజమాని దానిని అమ్మేయడంతో తాను కొనుగోలు చేసి యజమానిగా మారింది. ఆ మసాజ్ సెంటర్ నష్టాల్లో కొనసాగడంతో వ్యభిచార కేంద్రంగా మార్చేసింది. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయిస్తోందని పోలీసులు తెలిపారు.
Tags hyderabada INDIA khairathabad masaj telangana vyabhicharam