చెన్నైలోని రాజాజీ హాలు నుంచి కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం అయ్యింది. వేలాది మంది డీఎంకే కార్యకర్తలు, అభిమానులు వెంట నడుస్తుండగా యాత్ర ముందుకు సాగుతోంది. కలైంజ్ఞర్ ను కడసారి చూసేందుకు లక్షల మంది తరలివచ్చారు. రోడ్డు వెంట ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. తమ ప్రియతమ నేతకు నివాళులు అర్పిస్తున్నారు. వాలాజా రోడ్, చెపాక్ స్టేడియం రోడ్డు మీదుగా అంతిమయాత్ర మెరీనా బీచ్ కు చేరుకోనుంది. అన్నా స్క్వేర్ లోని అన్నాదురై సమాధి పక్కనే సాయంత్రం ఐదు గంటలకు ప్రభుత్వ అధికార లాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అటు మెరీనా బీచ్ లోనూ వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు కరుణానిధిని కడసారి చూసేందుకు ఎదురుచూస్తున్నారు. అన్నా స్క్వేర్ లో అంతిమ సంస్కారాల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.
“విశ్రాంతి లేకుండా ఇంతకాలం పనిచేసిన వ్యక్తి ఇక విశ్రాంతి తీసుకుంటారు” అనే కొటేషన్ కరుణానిధి శవపేటికపై తమిళంలో రాశారు.