కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ శనివారం ఓ ప్రకటనలో హెచ్చరించింది. అన్ని రాష్ట్రాలు తగిన సేఫ్టీ మెజర్స్ పాటించాలని సూచించింది. మహారాష్ట్రలో ఇప్పటికీ దేశంలోనే అత్యధికంగా డైలీ కేసులు రికార్డ్ అవుతున్నాయని తెలిపింది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 6,112 కేసు లు కన్ఫామ్ అయ్యాయని తెలిపింది. కేరళలో కూడా భారీగా డైలీ కేసులు వస్తున్నాయి. ఇక్కడ శుక్రవారం కొత్తగా 4 వేలకు పైగా డైలీ కేసులు వచ్చాయి. పంజాబ్‌లోనూ వారం రోజుల్లోనే కేసులు సడెన్ గా పెరిగాయి. శుక్రవారం 383 కొత్త కేసులు రికార్డ్ అయ్యాయి. మధ్యప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 297 కొత్త కేసులు వచ్చాయి. చత్తీస్‌గఢ్‌లో 259 కొత్త కేసులు కన్ఫామ్ అయ్యాయి.
దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో 75.87 కేసులు కేరళ, మహారాష్ట్రల్లోనే ఉన్నాయని కేంద్రం తెలిపింది. గడిచిన ఒక రోజు సమయంలో తెలంగాణతో సహా18 స్టేట్స్, యూటీల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదని పేర్కొంది. అన్ని రాష్ట్రాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తేనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలుగుతామని కేంద్రం సూచించింది.
Tags carona virus central chattisgud health ministry INDIA kerala madyapradesh maharastra panjab prications telangana