ఆర్ఎంపీ ఇంట్లో ఇన్ని ఆస్తులా ?

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నివాసం ఉంటున్న ఆర్ఎంపి వైద్యుడు కొడముల్లు ఆంజనేయులు ఇంట్లో ఐటీ శాఖ అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా 4 గంటలకు పైగా సోదాలు నిర్వహించారు. పట్టణంలోని వినాయకనగర్ లో నివాసం ఉంటున్న ఆర్ఎంపి వైద్యుడి ఇంట్లో ఐటి అధికారుల ఆదేశాల మేరకు సోదాలు చేయగా 66 లక్షల 11 వేయిల 100 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని, తదుపరి చర్యల నిమిత్తం డబ్బులను, ఆర్ఎంపి వైద్యున్ని ఆదాయ శాఖ అధికారులకు అప్పగిస్తామని ఏసీపీ మహేందర్ తెలిపారు.

error: