తెలంగాణ మల్లొకసారి కాంగ్రెస్ కి రేవంత్ కి అవకాశం ఇవ్వదు

తెలంగాణ మల్లొకసారి కాంగ్రెస్ కి రేవంత్ కి అవకాశం ఇవ్వదు
✅ ఒక్క ఛాన్స్ ఇస్తేనే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని నాశ‌నం చేశాడు
✅ ఒక్క అవకాశం ఇస్తేనే కాంగ్రెస్ తెలంగాణను పాతాళానికి తీసుకువెళ్లింది
✅ ఒక్క అవకాశం ఇస్తేనే అన్ని వర్గాలను మోసం చేసింది
✅ ఒక్క అవకాశం ఇచ్చిన కంటోన్మెంట్ కి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు
✅ కాంగ్రెస్ హింస‌కు స‌మాధానం చెప్పాల్సిన టైమ్ వ‌చ్చింది
✅ నియంత‌ల‌కే త‌ప్ప‌లేదు.. నువ్వెంత రేవంత్‌
✅ కాంగ్రెస్ నేత‌లు బెదిరిస్తే మాతో చెప్పండి.. వాళ్ల సంగ‌తి చూస్తాం
✅ రెండేళ్ల‌లో లూటిఫికేష‌న్ త‌ప్ప‌.. ఒక్క నోటిఫికేష‌న్ లేదు
✅ ఢిల్లీకి పంపేందుకు డ‌బ్బులు ఉన్నాయి.. పేద‌ల‌కైతే లేవా?
✅ కంటోన్మెంట్‌లో చేయ‌ని అభివృద్ధి.. జూబ్లీహిల్స్‌లో ఎలా చేస్తారు?
✅ బీఆర్ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
– బోర‌బండ‌ రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 👇
📌ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్నే భ్ర‌ష్టు ప‌ట్టించార‌ని రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
📌ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ఇప్పుడు రేవంత్ రెడ్డి అడుగుతున్నార‌ని.. కానీ అలా ఒక్క చాన్స్ ఇచ్చినందుకే.. నెంబ‌ర్ వ‌న్‌గా ఉన్న తెలంగాణ చివ‌రి ప్లేస్‌కు ప‌డిపోయింద‌ని అన్నారు.
📌రేవంత్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే 160 మందికి పైగా ఆటో డ్రైవ‌ర్లు ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
📌ఒక్క ఛాన్స్ ఇస్తేనే హైద‌రాబాద్‌ను భ్ర‌ష్టుప‌ట్టించి.. రియ‌ల్ ఎస్టేట్‌ను కూడా నాశ‌నం చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
📌ఇప్పుడు మ‌ళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఒక్క ఛాన్స్ అడుగుతున్నార‌ని రేవంత్ రెడ్డిని నిల‌దీశారు కేటీఆర్‌.
📌ఇలాగే ఒక్క ఛాన్స్ అంటూ కంటోన్మెంట్ నియోజకవర్గలో గెలిచి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు.
📌మరోసారి జూబ్లీహిల్స్ ప్రజలను మోసం చేయడం కోసమే రేవంత్ రెడ్డి మరొక్క ఛాన్స్ అంటూ అడుకుంటున్నారని…కానీ జూబ్లీహిల్స్ ప్రజలు మరొక చాన్స్ ఇవ్వరు అని కేటీఆర్ అన్నారు.
📌హింస, అరాచ‌క‌త్వంతో రెచ్చిపోతున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాల్సిన టైమ్ వ‌చ్చింద‌న్నారు. కాంగ్రెస్ రౌడీయిజానికి జూబ్లీహిల్స్ నుంచే ప్ర‌జ‌లు చ‌ర‌మ‌గీతం పాడ‌బోతున్నారని తెలిపారు.
📌ఇక్క‌డ ఎవ‌రైనా బెదిరింపుల‌కు దిగితే బాధితుల‌కు అండ‌గా ఉండి.. రౌడీల సంగ‌తి తేలుస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.
📌ఇక‌ అధికారంలోకి రావ‌డానికి నోటికొచ్చిన‌ హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఆ త‌ర్వాత ఒక్క హామీని కూడా నెర‌వేర్చ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
📌రాష్ట్రంలోని ప్ర‌తి ఒక్క‌రిని కాంగ్రెస్ స‌ర్కార్ మోసం చేసింద‌ని ఫైర‌య్యారు.
📌తమను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జూబ్లీహిల్స్ లో ప్రచారం చేసుకున్న నిరుద్యోగ అభ్యర్థులను యువకులను దాడులతో అడ్డుకుంటుందని కేటీఆర్ అన్నారు.
📌రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తమకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగడుతున్న యువతీ యువకులపై దాడులు చేయడం దారుణమన్నారు.
📌ఏడాదిలో రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన కాంగ్రెస్‌.. రెండేళ్ల‌లో రాష్ట్రాన్ని లూటీ చేయ‌డం త‌ప్ప‌.. నోటిఫికేష‌న్ ఇవ్వ‌లేద‌ని మండిప‌డ్డారు.
📌త‌న కుర్చీ కాపాడుకునేందుకు రాహుల్ గాంధీకి వంద‌ల కోట్లు పంపిస్తున్నార‌ని చెప్పారు.
📌ఢిల్లీకి పంపేందుకు డ‌బ్బులు ఉన్నాయి కానీ.. పేద‌ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర్చేందుకు డ‌బ్బులు లేవా అని ఆయ‌న నిల‌దీశారు.
📌అటు బుల్డోజ‌ర్ల పేరుతో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అరాచ‌కం సృష్టిస్తోంద‌ని అన్నారు. ఈరోజు కూకట్ పల్లి, కుతుబుల్లాపూర్ హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో వచ్చిన హైడ్రా బుల్లోజర్లు రేపు జూబ్లీహిల్స్ కి కూడా రావద్దు అంటే కారు గుర్తుపై ఓటు వేసి మాగంటి సునీతను గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
📌కేసీఆర్ హ‌యాంలో ఒక్క హైద‌రాబాద్‌లోనే ల‌క్ష డ‌బుల్ బెడ్రూం ఇళ్లు క‌ట్టిస్తే.. రేవంత్ స‌ర్కార్ మాత్రం వేలాది ఇండ్లు కూల‌గొట్టి ప్ర‌జ‌ల‌ను రోడ్డుపైకి లాగింద‌ని మండిపడ్డారు.
📌హైడ్రా బుల్డోజ‌ర్లు పేద‌ల ఇంటిపైకి రాకూడ‌దంటే.. హైడ్రా అనే రాక్ష‌సి మాయం కావాలంటే.. మాగంటి సునీత‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కోరారు.
📌కారు, బుల్డోజ‌ర్‌కు మ‌ధ్య జ‌రుగుతున్న ఈ ఎన్నిక‌లో బుల్జోడ‌ర్ ప్ర‌భుత్వానికి త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని పిలుపునిచ్చారు కేటీఆర్‌.

error: