ఇస్రో నుంచి మరో సంచలనం

బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన ‘గజ’ తుఫాన్ సవాళ్లు విసిరినప్పటికీ,భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో సంచలనాన్ని నమోదు చేసింది.బుధవారం సాయంత్రం చేపట్టిన GSLV మార్క్ 3 డీ 2 ప్రయోగం విజయవంతమైంది.దేశీయ సమాచార వ్యవస్థను మరింత శక్తివంతం చేసే జీశాట్-29 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.ముందస్తుగా నిర్ణయించిన సమయం ప్రకారమే సాయంత్రం ౫.౦౮ గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని రెండో ల్యాంచ్ ప్యాడ్ నుండి అంతరిక్ష వాహక నౌక GSLV మార్క్ 3 డీ 2 నింగిలోకి దూసుకెళ్లింది.

error: