ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఇప్పటివరకు ఏ ఒక్క దేశం సరైన మందును కనిపెట్టలేదు. తాత్కాలిక ఉపశమనం కోసం అందుబాటులో ఉన్న అన్ని రకాల మందులను వాడుతున్నారు. తాజాగా చర్మ సంబంధిత వ్యాధి సోరియాసిస్ చికిత్సకు ఉపయోగిస్తున్న ఇటోలీజుమ్యాబ్ మందును కోవిడ్-19 పేషెంట్లకు వాడవచ్చవంటూ భారత డ్రగ్ రెగ్యులేటరీ సంస్థ శుక్రవారం అనుమతులిచ్చింది. తీవ్రమైన తీవ్రమైన శ్వాసకోసతో బాధపెడుతున్న కోవిడ్ -19 రోగులకు ఈ మందును ఉపయోగించుకోవచ్చు అంటూ పీటీఐ సంస్థకు శుక్రవారం వెల్లడించింది.
ఇటోలీజుమ్యాబ్ మందును భారత్‌కు చెందిన బయోకాన్ సంస్థ తయారు చేస్తోంది. చాలా సంవత్సరాల నుంచి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు ఈ మందును ఉపయోగిస్తున్నట్లు బయోకాన్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. కరోనాతో బాధపడుతున్న రోగులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, ఆ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నట్లు తేలిన తరువాత ఇటోలిజుమ్యాబ్కు అనుమతులిచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దీనిపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ వి.జి. సోమయాని స్పందిస్తూ.. బయోకాన్ సంస్థ తయారు చేసిన మోనోక్లోనల్ యాంటీబాడీ ఇంజెక్షన్ ఇటోలిజుమాబ్ సోరియాసిస్ సంబంధిత సైటోకిన్ రిలీజ్ సిండ్రోమ్ చికిత్సకు ఉయపయోగిస్తారన్నారు. కోవిడ్-19 చికిత్సకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే ఈ మందును పరిగణలోకి తీసుకున్నామన్నారు
Tags central good news INDIA soriyalasis telangana