తెలంగాణలో ఓటర్ జాభితా రెండో సవరణ కార్యక్రమం మంగళవారంతో ముగిసింది.ఇందులో కొత్త ఓటర్ల నమోదుతో పాటు అభ్యంతరాలు ,సవరణలను స్వీకరించారు.అయితే కొత్తగా ఓటు నమోదు చేసుకొని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించే తుది గడువు 10 రోజుల ముందు వరకు ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఈసీ రజత్ కుమార్ తెలిపారు .అర్హులందరికీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తామన్నారు.
TS24 News