త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం- హరీష్ రావు

త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం తేనున్నట్లు, పూర్తి స్థాయిలో పారదర్శకంగా, సులభంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలోనే చర్చించి తెచ్చే అవకాశం ఉన్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో సోమవారం నియోజకవర్గం పరిధిలోని 1201 మంది అర్హులైన లబ్ధిదారులకు పట్టాదారు పాసు పుస్తకాలను, 101 మంది అర్హులైన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొత్త రెవెన్యూ చట్టం వచ్చిన తర్వాత నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పోయి సంతకం పెడితే.. ఇంటికే పట్టాదారు పాసు పుస్తకాన్ని పంపించేలా చేయబోతున్నామని పేర్కొన్నారు. మీ టైటిల్ డీడ్, ఇతరత్రా సమస్యలు లేకుండా సులభతరమైన ప్రజలకు ఆమోదయోగ్యమైన మార్పులు తేనున్నట్లు చెప్పారు. వచ్చే పంటకు ఎకరానికి పెట్టుబడి సాయం కింద రూ.5వేల రూపాయలు రైతుబంధు పథకం కింద ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దేశంలో ఆర్థిక మాంద్యంలో ఉన్నప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమ ప్రభుత్వం కాబట్టి పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో మాత్రం వెనక్కి తగ్గేదీలేదని.. పేదింట ఆడ పిల్ల పెళ్లికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రైతు సంక్షేమం కోసం రైతుబంధు పథకం ఇస్తున్నట్లు, ప్రత్యేకించి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ 6వేల కోట్లు రుణమాఫీ కేటాయింపు చేపట్టినట్లు, 4 ఏళ్లలో 6వేల కోట్లు రుణమాఫీ చొప్పున రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

error: