దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. బుధవారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 15,968 పాజిటివ్ కేసులు వచ్చాయని తెలిపింది కేంద్ర వైద్యారోగ్యశాఖ. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య4,56,183కి చేరగా..ఒక్కరోజే వైరస్ తో 465 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. 24 గంటల్లో 10,495 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు మొత్తం 2,58,685 మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా బారినపడ్డ 1, 83, 022 మంది ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని..ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 14,476కి చేరిందని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ.
కరోనా వైరస్ సోకిన వారిలో 2.58 లక్షల మంది ఇంతవరకూ రికవర్ అయ్యారని, రికవరీ రేటు 56.7 శాతానికి చేరుకుందని కేంద్రం తెలిపింది. మంగళవారం 2,15,195 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఒక రోజులో చేసిన అత్యధిక పరీక్షల సంఖ్య ఇదేనని తెలిపింది. ఇంతవరకూ 73,52,911లక్షలకు పైగా టెస్ట్ లను చేశామని వెల్లడించింది. యావరేజ్ పాజిటివ్ రేటు 7.42 శాతమని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ.