వైసీపీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో అశ్లిల నృత్యాలు

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే వైసీపీ సత్తి సూర్యనారాయణరెడ్డి జన్మదిన వేడుకలు విమర్శలపాలయ్యాయి. ఎటువంటి హంగామా లేకుండా జన్మదిన వేడుకలు నిర్వహించాలని, పూలమాలలు, కేకు కటింగ్‌ వంటి హంగామా చర్యలు లేకుండా శుభాకాంక్షలు తెలపాలని ఎమ్మెల్యే ప్రకటించారు. ఇందుకు భిన్నంగా పెదపూడిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు బహిరంగంగా అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు. వేదికపై బహిరంగంగా ఐదుగురు అమ్మాయిలతో డ్యాన్సులు చేయించారు. అశ్లీల నృత్య ప్రదర్శనను నిరోధించవలసిన అధికార యంత్రాంగం మిన్నుకుండిపోయింది. కూత వేటు దూరంలో పోలీసుస్టేషన్‌ ఉన్నా అశ్లీల నృత్యాలను అడ్డుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

error: