స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి షాక్‌

కర్ణాటకలో 102 స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. అన్ని మున్సిపాలిటీలకు కలిపి 2,709 సీట్లకు గాను 2 వేల 664 స్థానాల్లో ఫలితాలు ప్రకటించారు. కాంగ్రెస్ 982 సీట్లు దక్కించుకుంది. దీంతో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలిచింది కాంగ్రెస్‌.

కేంద్రంలో బీజేపీ పాలన పట్ల విసిగిపోయిన జనం…అన్ని ఎన్నికల్లో కాషాయ పార్టీకి బుద్ధి చెబుతున్నారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి ప్రజల మద్దతు ఉందనేందుకు ఇదే నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ తో జత కట్టి అధికారం దక్కించుకున్న జేడీఎస్‌ కూడా 375 స్థానాలను గెలిచింది. ఈ ఫలితాల పట్ల జేడీఎస్‌ నేత, కర్ణాటక సీఎం కుమార స్వామి సంతోషం వ్యక్తం చేశారు.

పలు నగరాల్లో బీజేపీకి చేదు ఫలితాలే వచ్చాయి. షిమోగా, తుముకూరు, మైసూర్ లలో మినహా బీజేపీకి అన్ని ప్రధాన నగరాల్లో ఓటమి తప్పలేదు. ఈ ఫలితాలు తమను నిరాశకు గురిచేశాయన్నారు బీజేపీ నేత యడ్యూరప్ప.

error: